google-gemini-AI-high-resolution-videos-details

google-gemini-AI-high-resolution-videos-details

Google అందిస్తున్న AI అసిస్టెంట్ Geminiని ఉపయోగించి మీలోని క్రియేటివిటీని వెలికి తీయండి, మీ ప్రొడక్టివిటీని మెరుగుపరచుకోండి.
Googleకు చెందిన అత్యుత్తమ AI మోడల్స్‌ను డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోనే యాక్సెస్ చేసేందుకు Gemini అవకాశం కల్పిస్తుంది. తద్వారా మీరు ఇవి చేయవచ్చు:

గూగుల్ జెమిని యాప్ ఇప్పుడు సరికొత్త రూపంలోకి మారింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆరు కీలక ఫీచర్లను ప్రకటించింది. ఈ అప్ డేట్స్ అన్నీ కూడా చాట్‌బాట్‌ను 24/7 డిజిటల్ అసిస్టెంట్‌గా మార్చాయి. యూజర్లు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఉపయోగించే విధానాలను సమూలంగా మార్చివేశాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో వీటిని నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్స్ గా చెప్పుకోవచ్చు.

గూగుల్ నెక్స్ట్ జెన్ కు సంబంధించిన జెమిని 3.5లో మొదటి మోడల్ ‘జెమిని 3.5 ఫ్లాష్’ ప్రధానమైనది. మరింత స్పీడ్, మెరుగైన కెపాసిటీ కోసం రూపొందించిన ఫీచర్ ఇది. సంక్లిష్టమైన కోడింగ్, రియల్ టైమ్ ఇష్యూస్ ను చిటికెలో పరిష్కరించడం వంటి పనులను అతి వేగంగా, ఖచ్చితత్వంతో మేనేజ్ చేయగలదీ ఫీచర్.

అదే క్రమంలో గూగుల్ ‘జెమిని స్పార్క్’ను ప్రవేశపెట్టింది. ఇది 24/7 పని చేసే పర్సనల్ AI ఏజెంట్. సాధారణ చాట్‌బాట్‌లకు భిన్నం. ఇది మన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. మనం హైడ్ చేసి ఉంచిన వివరాలు.. ఉదాహరణకు బ్యాంక్ స్టేట్‌మెంట్లు గానీ, ఫ్యామిలీ ఫొటోలు గానీ, ఇతరత్రా వ్యక్తిగత విషయాలను సెర్చ్ చేస్తుందీ ఫీచర్. ఈమెయిల్స్ లల్లో హైడ్ చేసిన వివరాల కీవర్డ్ ఇస్తే వాటినీ వెలికి తీయగలదు. స్పార్క్, యాంటిగ్రావిటీ హార్నెస్‌ను ఉపయోగించడం జెమిని 3.5 ప్రత్యేకత. జీమెయిల్, డాక్యుమెంట్స్, స్లైడ్స్ వంటి వర్క్‌స్పేస్ టూల్స్‌తో లింక్ చేయగలుగుతుంది. 

జెమినిలో మరో కొత్త ఫీచర్.. ‘న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్’. పూర్తిగా కొత్త విజువల్ లుక్ తో రూపొందింది. ఆకట్టుకునే యానిమేషన్లు, దానికి అవసరమైన కలర్స్, సుదీర్ఘ టెక్స్ట్ బదులుగా ఇంటరాక్టివ్ టైమ్‌లైన్స్, డైనమిక్ గ్రాఫిక్స్‌తో రియల్ టైమ్ రియాక్షన్స్ ఇందులో ఉంటాయి. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లల్లో న్యూరల్ ఎక్స్‌ప్రెసివ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మైక్రోఫోన్‌ను తిరిగి రూపొందించింది.. గూగుల్. దీనిద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు మాట్లాడవచ్చు. త్వరలో రీజినల్ లాంగ్వేజెస్ మాత్రమే కాకుండా ప్రాంతీయ మాండలీకాలను కూడా అందుబాటులోకి తెస్తామని గూగుల్ వెల్లడించింది. ‘జెమిని ఓమ్ని’.. వీడియో ప్రియుల కోసం రూపొందించిన క్రియేటివ్ టూల్. ఇది సాధారణ టెక్స్ట్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌లను హైరిజాల్యూషన్ గల సినిమాటిక్ వీడియోలుగా మారుస్తుంది. సంభాషణల ద్వారా యూజర్లు ఫుటేజ్‌ను ఎడిట్ చేయవచ్చు లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చవచ్చు. కెమెరా రోల్ నుండి ఫుటేజ్‌ను అప్‌లోడ్ చేసి, సింగిల్ ట్యాప్‌తో ఇన్‌బిల్ట్ టెంప్లేట్‌లను వర్తింపజేసే వెసలుబాటు ఉంది.

GOOGLE GEMINI AI APP CLICK HERE