thalliki-vandanam-money-june-19-complete-details
- డ్రాపౌట్లను తగ్గించడం: పేదరికం కారణంగా పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా నిరోధించడం.
- ఆర్థిక సహాయం: పాఠశాల/కళాశాల ఫీజులు, పుస్తకాలు మరియు ఇతర విద్యా ఖర్చుల కోసం తల్లులకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించడం.
- తరగతులు: విద్యార్థి తప్పనిసరిగా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతుండాలి.
- పాఠశాలలు: ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు/కళాశాలల విద్యార్థులందరూ దీనికి అర్హులు.
- హాజరు శాతం: విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి.
- మినహాయింపులు: ఐటిఐ (ITI), పాలిటెక్నిక్, ఐఐఐటి (IIIT) వంటి ఫీజు రీఇంబర్స్‌మెంట్ వర్తించే కోర్సుల విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
- కుటుంబ పరిమితి: నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి తల్లికి/సంరక్షకురాలికి ఈ ఆర్థిక సాయం అందుతుంది
రాష్ట్రంలోని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది. తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది
తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్ నంబర్‌తో బ్యాంకు NPCI మ్యాపర్‌లో లింక్ అయిందో లేదో ఈ కింది విధంగా సులువుగా చెక్ చేసుకోండి.
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించాలి.
- అందులో My Aadhaar సెక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- Aadhaar Services కింద Check Aadhaar/ Bank Linking Status లోకి వెళ్లాలి.
- అక్కడ మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- send OTPపై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- OTP నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే స్క్రీన్‌పై ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉందో.. దాని లింకింగ్ స్థితి మీకు కనిపిస్తుంది.
ఒకవేళ NPCI లింక్ అవకుంటే రెండు పద్ధతుల ద్వారా లింక్ చేయవచ్చు. ఎలాగంటే..
మీ బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆధార్ నంబర్‌ను మీ అకౌంట్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఒకే ఒక బ్యాంకు ఖాతాను NPCI మ్యాపర్‌కు లింక్ చేయాలని అధికారులు తెలిపారు. ఒక వేళ మీరు మరొక బ్యాంకు అకౌంట్‌కు మార్చుకోవాలంటే కొత్త అకౌంట్‌లో NPCI లింకింగ్ ప్రక్రియను పూర్తి చేస్తే.. ఆటోమెటిక్‌గా పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కు ఓవర్‌రైడ్ అవుతుందని అధికారులు సూచించారు.
