ap-medical-reimbursement-report-status

ap-medical-reimbursement-report-status

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వోద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్టేటస్‌ను అధికారిక AP EHS (Employee Health Scheme) వెబ్‌సైట్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ స్టేటస్.
గత సంవత్సర కాలంగా  NTR  వైద్య సేవ మరియు CSE లో పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల స్క్రూటిని పూర్తి అయ్యి  శాంక్షన్ ఆర్డర్ లు జారీ అగుచున్నవి.
ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకొని శాంక్షన్ కోసం CSE ద్వారా ప్రభుత్వానికి పంపిన బిల్లులకు కూడా శాంక్షన్ ఆర్డర్స్  వస్తున్నాయి.
కనుక బిల్లులు పెండింగ్ లో ఉన్నవారు మీ బిల్ ఐడీతో కింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
స్టేటస్ తెలుసుకునే విధానం:

ముందుగా AP EHS ఇండివిజువల్ మెడికల్ రిపోర్ట్ లింక్ ను ఓపెన్ చేయండి.

పేజీలో అడిగిన ‘Medical Reimbursement Type’ (Online, Offline లేదా SDE) ను సెలెక్ట్ చేయండి.

మీ యొక్క MR నెంబర్, ఎంప్లాయ్ ఐడీ (Employee No) లేదా క్లెయిమ్ ఐడీ వివరాలను నమోదు చేయండి.

వివరాలను సబ్మిట్ (Submit) చేసిన వెంటనే మీ బిల్లు ఏ దశలో ఉందో స్పష్టంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ప్రొసీడింగ్స్ కోసం మీ  DDO ను సంప్రదించగలరు.