10th-class-ssc-2026-short-marks-list-marks-memos
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) 2026 షార్ట్ మార్క్స్ మెమోలు విడుదలయ్యాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ షార్ట్ మెమోలను అధికారికంగా పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచింది.
మీ మార్కుల మెమోలో తప్పులు గుర్తిస్తే, వెంటనే మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులను (HM) సంప్రదించాలి. వారు తమ స్కూల్ లాగిన్ లోని ‘Edit Option’ ద్వారా వాటిని సరిచేస్తారు
SSC 2026 విద్యార్థుల వివరాల అప్డేట్ కు ఆఖరి అవకాశం
హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయునది ఏమనగా, మార్చి 2026లో జరిగిన SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోరాండం (షార్ట్ మెమోలు) ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ అనగా https://bse.ap.gov.in ద్వారా స్కూల్ లాగిన్లలో ఈరోజు అందుబాటులో ఉంచడమైనది.
కావున, ప్రధానోపాధ్యాయులందరూ సంబంధిత విద్యార్థులందరి మార్కుల మెమోరాండంను డౌన్లోడ్ చేసుకొని, వీలైనంత త్వరగా సంబంధిత పాఠశాల సంతకం మరియు సీలుతో విద్యార్థులకు అందజేయవలసిందిగా ఆదేశించడమైనది.
ఇంకా, ప్రధానోపాధ్యాయులందరూ అభ్యర్థుల పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలను జాగ్రత్తగా సరిచూసుకొని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో ధృవీకరించుకోవలసిందిగా కోరడమైనది.
అంతేకాకుండా, విద్యార్థుల వివరాలలో అవసరమైన దిద్దుబాట్లు చేయుటకు గాను *29.05.2026 నుండి 04.06.2026 వరకు అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in ద్వారా స్కూల్ లాగిన్లలో ‘ఎడిట్ ఆప్షన్’ అందుబాటులో ఉంచబడుతుందని తెలియజేయడమైనది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను సరిచూసిన తర్వాత, నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని దిద్దుబాట్లు జరిగేలా చూడాలి.
*గమనిక*: విద్యార్థులు మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటిపేరు తప్పులు ఉంటే వెంటనే మీ స్కూల్ HM కి చెప్పి, పైన ఇచ్చిన తేదీల్లో సరిచేయించుకోండి.
10th CLASS 2026 SHORT MARKS LIST MEMOS LINK CLICK HERE
